నారాయణపేట్: నారాయణపేట: ఎంబిబిఎస్ విద్యార్థినుల హాస్టల్లో అగ్నిప్రమాదం
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎంబిబిఎస్ విద్యార్థినుల హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. విద్యార్థినుల పుస్తకాలు, నగదు, బట్టలు కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. హాస్టల్ వద్ద భద్రత కల్పించాలని విద్యార్థినులు కోరుతున్నారు.