నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా మరికల్ మండల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరికల్ సిఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ రాము లు కలిసి శుక్రవారం 11 గం సమయంలో మరికల్ మండల పరిధిలోని మరికల్ పెద్ద చింతకుంట కొల్లం పల్లి తీలేరు గ్రామాలలో వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక సౌకర్యాలు తాగునీరు విద్యుత్తు భారీకేడ్లు మరుగుదొడ్లు శానిటేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలు తమ ఓటు హక్కును భయపడకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.