ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 11 గం. సమయంలో కలెక్టర్ తన ఛాంబర్ లో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి మాతృత్వం ఒక వరం అందుకు దత్తత మరో మార్గం కు సంబంధించిన వాల్ పోస్టర్ ను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాను సారంగా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో దత్తత తీసుకున్న నెల గా జరుపుకోవడం జరుగుతుందని ఈ సంవత్సరం కూడా జరుపుకుంటారని తెలిపారు.