ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పరిమితికి మించి ప్రయాణికులను విద్యార్థులను కూలీలను ఆటోలో ఎక్కించుకోరాదని వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని పేట సిఐ శివశంకర్ అన్నారు. పేట మండల పరిధిలోని పేరపళ్ళ గ్రామం నుండి నారాయణపేట పట్టణానికి వస్తున్న ఆటోలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విద్యార్థులను ప్రయాణికులను పరిమితికి మించి తీసుకు వెళుతున్న ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ ను సిఐ శివశంకర్ ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య రూరల్ ఎస్సై రాముడు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు 9 గంటల సమయంలో ఓ ప్రకటనలో సీఐ తెలిపారు.