నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, సిపిఎం జిల్లా కార్యదర్శి జి. వెంకట్రామా రెడ్డి శుక్రవారం ఉదయం సుమారు 10 గం. సమయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేశారు. 1882 సం. అంతర్ కమిషన్ బలహీన వర్గాలకు విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక ఇచ్చారని ఆయన స్ఫూర్తితోనే మన ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.