పేట జిల్లాలో జిపి ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని పేట జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఏ. సీతాలక్ష్మి అధికారులకు సూచించారు. గురువారం నాలుగు గంటల సమయంలో పేట కలెక్టరేట్ కు వచ్చిన ఆమె కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూము ను పరిశీలించారు. అనంతరం కొత్తపల్లి మండలం నిడ్జింత మద్దూరు మండలంలోని నాగిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు పొరపాట్లు లేకుండా చూడాలన్నారు.