నవంబర్ 29వ తేదీన నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమం విజయవంతం చేద్దామని పేట మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్ఆర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం రెండు గంటల సమయంలో ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నవంబర్ 29న దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సిన విధివిధానాలపై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.