నారాయణపేట జిల్లా కృష్ణ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణ ఎస్ఐ ఎస్ఎం నవీద్ ఎంపీడీవో విజయ ఎంఆర్ఓ శ్రీనివాసులు కలిసి శుక్రవారం నాలుగు గంటల సమయంలో చెక్ పోస్టు మరియు పోలింగ్ బూత్ లను సందర్శించారు. ఈ సందర్శనలో వారు పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సిన ప్రాథమిక సౌకర్యాలు భద్రతా చర్యలు తాగునీరు విద్యుత్తు టాయిలెట్ సదుపాయాలు ప్రహరీ గోడలు వికలాంగులకు అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. కృష్ణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని సూచించారు.