తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి గురువారం 4:30 గంటల సమయంలో అన్ని జిల్లాల ఎస్పీలు కమిషనర్లు పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, డిఎస్పి నల్లపు లింగయ్య, సిఐ,ఎస్ఐ లు స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో పోలీసులు పాటించాల్సిన ఎన్నికల నియమావళి భద్రత చర్యలు, చట్టం శాంతి పరిరక్షణ మరియు అమలులో ఉండే ఆంక్షల పై డిజిపి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.