నారాయణపేట్: 3 సార్లు రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని: జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతామంటున్న పీడీ
నారాయణపేట జిల్లా విఠలాపూర్ జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థిని శిరీష 3 సార్లు రాష్ట్రస్థాయికి ఎంపికైంది. పీడీ వేణుగోపాల్ శిక్షణలో రాణిస్తున్న శిరీషను పాఠశాల యాజమాన్యం, గ్రామస్తులు అభినందించారు. విద్యార్థులను జాతీయ స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యమని పీడీ వేణుగోపాల్ తెలిపారు.