ఉరవకొండ: బెలుగుప్పలో అగ్ని ప్రమాదం పశుగ్రాసం, గృహపకరణాలు, పశువుల షెడ్డు దగ్ధం -రూ. ఐదు లక్షల ఆస్తి నష్టం
అనంతపురం జిల్లా బెలుగుప్ప కేంద్రానికి చెందిన రైతు శివ, పశుగ్రాసం నిలువ ఉంచుకున్న దొడ్డి లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో వేరుశనగ పశుగ్రాసం, వరిగడ్డి, ఇంటి నిర్మాణానికి వినియోగించే కొన్ని గృహపకరణాలు (దూలాలు), పశువుల షెడ్డుతో పాటు మొత్తం సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు రైతు వాపోయాడు. ప్రమాదంపై కళ్యాణదుర్గం అగ్నిమాపక యంత్రం అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు చుట్టు ప్రక్కల గడ్డివాములకు విస్తరించకుండా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.