ఉరవకొండ లోని పీఏబీఆర్ డ్యాం మోటర్ మరమ్మతులు, కొత్త మోటర్ ఏర్పాటుకు రూ.3.50 కోట్లు నిధులను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం మంజూరు చేయించారు. ఒక మోటర్ తో మాత్రమే నీటిని పంపింగ్ చేయాలంటే ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో మంత్రి స్పందించి అదనంగా మరో మోటార్ ఏర్పాటు చేయడంతో పాటు చెడిపోయిన మోటార్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయించారు.