ఉరవకొండ: పట్టణంలో ఇటీవల జరిగిన వింత దొంగ తనం సీసీ టీవీ వీడియోస్ వైరల్
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఇటీవల జరిగిన వింత దొంగతనం ఘటన సీసీ టీవిలో నిక్షిప్తమైన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న బిగ్ బజార్ దుకాణంలో చోరీ జరిగింది. షట్టర్ తాళాలు పగలగొట్టి షాపులోకి ప్రవేశించిన దొంగ..క్యాష్ టేబుల్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఫొటో ముందు కాసేపు ఆగాడు.దొంగతనానికి ముందు స్వామివారికి చేతులు జోడించి మొక్కి.. ఒక నిముషం పాటు ఎదో ప్రార్థనతో చెప్పుకున్నాడు. ఆ తర్వాత తన పని కానిచ్చేసి దొంగతనం చేసుకుని వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.