ఉరవకొండ: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన శ్రీనివాస విద్యానికేతన్ విద్యార్ధి ప్రభంజన్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీనివాస విద్యానికేతన్లో 9వ తరగతి చదువుతున్న బి.ప్రభంజన్ జిల్లాస్థాయి పరుగు పందెంలో సత్తా చాటి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక అయ్యాయని పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసులు, హెచ్ఎం సుమలు మంగళవారం పేర్కొన్నారు. గత రెండు రోజులుగా అనంత క్రీడాగ్రామంలో జరుగుతున్న స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్షిప్–2026లో 600 మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడంతో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) శ్రీ ఆయుబ్ హుస్సేన్ గారు విద్యార్థికి మెడల్ అందజేసి అభినందించారన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభను చాటాలన్నారు.