రాప్తాడు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు వివరాలు వెల్లడించిన ఇంచార్జ్ డిఎస్పి చంద్రశేఖర
ఆత్మకూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో గురువారం ఒంటి గంట సమయంలో అనంతపురం రూరల్ ఇంచార్జ్ డిఎస్పి చంద్రశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డిఎస్పి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆత్మకూరు మండలంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని వారి వద్ద నుంచి ఒకటిన్నర కిలో గంజాయి రెండు ద్విచక్ర వాహనాలు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అందులో ఒక నిందితుడు గంజాయి సేవించడం జరిగిందని పరీక్షల్లో నిర్ధారించడం జరిగిందని, రూరల్ ఇన్చార్జి డిఎస్పి చంద్రశేఖర్ మీడియాకు వివరాలను వెల్లడించారు, ఈ సమావేశంలో సిఐ హేమంత్ కుమార్ పాల్గొన్నారు.