సత్య సాయి జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకుని కాలినడకన గిరి ప్రదక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబునాయుడు ఆరోగ్యంగా ఉండాలని తమిళనాడులోని అరుణాచలంలో శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.