సత్య సాయి జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎగువపల్లి వద్ద అంతర్ రాష్ట్ర రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గట్కారి కి నిధులు విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఎగువపల్లి తగరకుంట రోడ్డు 20 కిలోమీటర్ల మేరకు ఐ ఎస్ సి పథకం కింద రాష్ట్ర మధ్య అనుబంధం డబుల్ లైన్ విస్తరణ పనులకు 30 కోట్లు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.