సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 3:45 నిమిషాల సమయంలో సత్య సాయి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహదేవ్ కనగానపల్లి సిపి పార్టీ మండల కార్యదర్శి బాలరాజు ఇతర రైతు సంఘం నేతలతో కలిసి బద్దలాపురం గ్రామంలో అరటి రైతు గోపాల్ తోటలో అరటి సాగును పరిశీలించి కనగానపల్లి ఎమ్మార్వో కు అరటి రైతులు ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మహదేవ్ బాలరాజు మాట్లాడుతూ సత్య సాయి జిల్లాలో 500 ఎకరాల్లో అరటి సాగు చేశారని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు పండించిన అరటి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు.