సత్య సాయి జిల్లా రామగిరి మండలం కొత్తగాదికుంట గ్రామంలో బుధవారం 12:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అందివిధాల అదుక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నామని, అదేవిధంగా రైతుల కోసమే అన్నదాత సుఖీభవ పథకం ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు టిడిపి నేతలు ప్రజలు పాల్గొన్నారు.