కనిగిరి: దీపావళి నాటికి మొదటి దశ పూర్తి చేసి టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి మండలం చాకిరాల వద్ద గల టిడ్కో గృహాల సముదాయం వద్ద ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టిడ్కో గృహాల లబ్ధిదారులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి టిడ్కో గృహాలను కంప్లీట్ చేసి ఇవ్వలేదన్నారు. గడిచిన ఆరు నెలలుగా అధికారుల వెంటపడి పనులు చేయిస్తున్నామన్నారు. ప్రస్తుతం మిగిలిన పనులు పూర్తి చేసి, మౌలిక వసతులు కల్పించి, దీపావళిలో మొదటి విడత, అనంతరం సంక్రాంతి లోపు రెండు విడతలుగా గృహాలను లబ్ధిదారులకు ఇస్తామన్నారు.