పెదచెర్లోపల్లి మండలంలోని మురుగమ్మి గ్రామంలో అడవి పేరంటాలమ్మ తల్లి తిరునాళ్ల జరుగుతోంది. తిరునాళ్ల సందర్భంగా గ్రామంలో గురువారం జోరుగా కోడిపందాలు కొనసాగుతున్నాయి. లక్షల రూపాయలు కోడిపందాలలో చేతులు మారుతున్నాయని, అధికారుల నియంత్రణ కొరబడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క కోడిపందానికి నిర్వాహకులు రూ.10 వేలు కమిషన్ వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.