సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి నియోజకవర్గంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. సైబర్ క్రైమ్స్ వల్ల ఎంతోమంది నగదు పోగొట్టుకొని అవి తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి విక్రయాలు చాలా వరకు తగ్గినప్పటికీ, పూర్తిస్థాయిలో గంజాయిని నియంత్రించవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. గంజాయి మత్తులో చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.