రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గం రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆనంద్ కు వినిత పత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం 12 గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గ రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆనంద్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్తు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా పేరూరు డ్యామ్ కు హంద్రీనీవా నీటితో నింపి రైతులను ఆదుకోవాలని అదేవిధంగా పంటలు వేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులకు 9 గంటల పాటు నాన్నమైన విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.