రాప్తాడు: కనుక పల్లిలో రీ సర్వే చేసిన పట్టా పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన ఎమ్మార్వో మనోజ్ కుమార్ ప్రజా ప్రతినిధులు
కనగానపల్లి మండల కేంద్రంలో బుధవారం 11 గంటల 45 నిమిషాల సమయంలో ఎమ్మార్వో మనోజ్ కుమార్ కనగానపల్లి రెవిన్యూ పొలంలో రీ సర్వే చేసిన భూములకు రి సర్వే పట్టా పాస్ పుస్తకాలను ప్రజాప్రతినిధితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ చౌదరి ఎమ్మార్వో మనోజ్ కుమార్ మాట్లాడుతూ కనగానపల్లి రెవిన్యూ పొలంలో రీ సర్వే చేసిన భూములకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని దీనివల్ల ఎలాంటి భూ సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉందని రీ సర్వే కాని భూములు ఉంటే త్వరగా పూర్తి చేయించుకోవాలని ఎమ్మార్వో మనోజ్ కుమార్ రాప్తాడు మార్కెట్ చైర్మన్ సుధాకర్ చౌదరి పేర్కొన్నారు.