రాప్తాడు: సోమలదొడ్డి ఇస్కాన్ మందిరం నందు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా తులసి అర్చన గరుడసేవ దీపోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోమల దొడ్డి వద్ద ఉన్న ఇస్కాన్ మందిరంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటలకు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ మేనేజర్ దామోదర్ దాస్ మాట్లాడుతూ ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి తులసి అర్చన గరుడసేవ ఊంజల సేవ దీపోత్సవం పంచామృత అభిషేకాలు పుష్ప అభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని కృష్ణుని దర్శించుకోవడం జరిగిందని అదేవిధంగా భక్తులు కూడా తీర్థ ప్రసాదాలను పంపిణీ చేసామని ఇస్కాన్ మేనేజర్ దామోదర్ దాస్ పేర్కొన్నారు.