ఉరవకొండ: ఉరవకొండలో గడే హోత్తూరు ఎంపీటీసీగా గెలుపొందిన పరమేష్ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల 15 నిమిషాల సమయంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని కనేకల్లు మండలం గడే హోత్తూరు ఎంపీటీసీగా గెలుపొందిన పరమేష్ ఆధ్వర్యంలో వారి అనుచరులంతా విశేశ్వర్ రెడ్డిని కలిసి ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచేందుకు సహకారం అందించినందుకు శాలువాతో సత్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ ఎంపీటీసీలుగా జడ్పిటిసిలుగా గెలిచినవారు ప్రజలకు అందుబాటులో ఉండి కూటము నాయకులు చేసే దౌర్జన్యాల పట్ల పోరాటం చేయాలని వైసిపి నేతలకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.