రాప్తాడు: హంపాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం వద్ద మంగళవారం 11:30 గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు మండలంలో రైతులకు న్యాయమైన విద్యుత్ సరఫరా చేయలేనందువల్ల విద్యుత్ మోటర్లు కాలిపోతున్నాయని 9 గంటల పాటు విద్యుత్ సరిగా రావడం లేదని అందువల్ల రైతులు పంట నష్టపోతున్నారని ఇప్పటికైనా నాణ్యమైన విద్యుత్తును అందించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు .