ఉరవకొండ: అంకంపల్లి గ్రామంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుక సంబరాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని అంకంపల్లి గ్రామంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను గ్రామస్తులు యాదవ సోదర సోదరిమణులు కలసి ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీకృష్ణ దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలను నిర్వహించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. సాయంత్రం గ్రామంలో పంచ కళ్యాణి వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహ మూర్తులతో గ్రామోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగ నిర్వహించారు. గ్రామోత్సవ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.