నారాయణపేట్: గణేష్ ఉత్సవాల వేళ పోలీస్ సిబ్బందికి సెలవులు రద్దు: జిల్లా ఎస్పీ ఆదేశం
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాలు ముగిసే వరకు పోలీస్ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.