ఉరవకొండ: ఉరవకొండ పోలీస్ గ్రౌండ్ లో గాయపడిన గోవుకు పశు వైద్యలతో వైద్యం చేయించి మానవత్వం చాటుకున్న ఇందిరానగర్ యువకులు
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఉరవకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ గ్రౌండ్ నందు గత పది రోజులుగా గాయపడిన ఒక తిరుగుతున్న సందర్భంలో ఇందిరానగర్ కు చెందిన యువకులు సాహసం చేసి గాయపడిన ఆవులు తాడుతో బంధించి ఉరవకొండ పట్టణంలోని పశు వైద్యులను తీసుకువచ్చి గాయపడిన ఆవుకు గాయాన్ని శుభ్రం చేయించి ఇంజక్షన్ వేయించి ఆవును రక్షించడం జరిగింది. ఈ సంఘటన గమనించిన ఉరవకొండ పట్టణానికి సంబంధించిన పలువురు ప్రజలు మానవత్వం చాటుకున్న ఇంద్రనగర్ యువకులను పట్టణవాసులు అభినందించడం జరిగింది.