కనిగిరి: పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా స్వామివారి పల్లకి సేవోత్సవ కార్యక్రమం
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో శనివారం స్వామివారి పల్లకి సేవోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి, స్వామివారి పల్లకీని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి పూజలు చేశారు. వేద పండితులు భక్తులకు ఆశీర్వచనాలను అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.