నారాయణపేట్: దామరగిద్దలో గణేష్ ఉత్సవాలపై పోలీసుల హెచ్చరికలు: డీజేలకు నో పర్మిషన్!
దామరగిద్దలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై ఎస్ఐ నరేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. భద్రతా జాగ్రత్తలపై నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు.