నారాయణపేట్: BC మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు: సెప్టెంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోండి
జిల్లాలోని బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన వారు సెప్టెంబర్ 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించాలని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు.