నారాయణపేట్: స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు: బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నాయకుల తీవ్ర ఆగ్రహం
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. నారాయణపేటలో జరిగిన మీడియా సమావేశంలో, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవులను గౌరవించాలని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.