నారాయణపేట్: ఉప సర్పంచుల చెక్ పవర్ కొనసాగించాలి: కలెక్టర్‌కు వినతిపత్రం
ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దును నిరసిస్తూ, ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. చెక్ పవర్‌తో పాటు గౌరవ వేతనం పెంపు, అధికారిక సమావేశాల్లో ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాతరి గోపాల్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.