కనిగిరి: కనిగిరి విద్యార్థి తౌషిక్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి: బీసీవై పార్టీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు నజీర్ భాష
సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి తౌషిక్ తల్లి మౌలాబి తన కుమారుడిని హత్య చేశారని న్యాయం చేయాలని పోరాటం చేసి విసిగి ఆత్మహత్య చేసుకుందని బీసీవై పార్టీ ప్రకాశం జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ నజీర్ బాషా అన్నారు. కనిగిరిలో ఆదివారం అయిన మాట్లాడుతూ... ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హైదరాబాదులో చికిత్స పొందుతూ విద్యార్థి తౌషిక్ తల్లి మృతి చెందిందని, మృతదేహాన్ని పోస్టుమార్టం చేస్తే కానీ కనిగిరి కి రానివ్వమని పోలీసులు చెప్పడం ఆవేదన కలిగించిందన్నారు. ఈ ఘటనపై ముస్లిం మైనారిటీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాయని హెచ్చరించారు.