రాప్తాడు: ఒకే కులం ఒకే సంఘం ఒకే కురుబ అధ్యక్షుడు ఉండాలి అనంతపురంలో రాప్తాడు కురువ సంఘం యువ నాయకుడు బండి పరశురాం డిమాండ్
అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం 12:30 గంటల సమయంలో రామ్ నగర్ కురుబ సంఘం కార్యాలయంలో రాప్తాడు కురుబ సంఘం యువ నాయకుడు బండి పరశురాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కురువ సంఘం యువ నాయకుడు పరశురాం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కురుబలంతా ఐక్యంగా ఉండాలని అలాకాకుండా ఒక కులానికి ఒక అధ్యక్షుడు కాకుండా ఇద్దరు ముగ్గురు అధ్యక్షులు ఉండడం సరైనది కాదని ఇప్పటికైనా రాజహంస శ్రీనివాసులు బోరంపల్లి ఆంజనేయులు ఇతర కురబ సంఘం అధ్యక్షులుగా ప్రకటించుకున్న వాళ్లంతా ఆలోచించుకోవాలని కురుబలంతా ఒకే తాటిపై క నుండి ఒకే అధ్యక్షుని ఎన్నుకోవాలని రాప్తాడు కురుబ సంఘం బండి పరశురాం పేర్కొన్నారు.