ఉరవకొండ: వజ్రకరూరులోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలోని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వజ్రకరూర్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మోనాలిసా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాలకమిటీ చైర్మన్ శాంత వర్ధన్, సామాజికవేత్త, అంబేద్కర్ అవార్డు గ్రహీత బెంజిమెన్, మహిళా యువ నాయకురాలు స్వరూప తదితరులు హాజరై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కేటి రంగ ప్రసాద్ బాబు, ఉపాధ్యాయులు కౌసల్య, అశోక్ కుమార్, అరుణ కుమారి, శ్రీనివాసులు, శివ తదితర ఉపాధ్యాయులను దుశ్యాలువాలు, పూలమాలలు మేమెంటోలతో ఘనంగా సన్మానించారు.