కనిగిరి: కనిగిరిలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ
కనిగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ కుందూరు తిరుపతిరెడ్డి దంపతులు, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.