కనిగిరి: మాలకొండ ఘాట్ రోడ్డులో భక్తుల ట్రాలీ బోల్తా - పలువురికి గాయాలు
ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మాలకొండ ఘాట్ రోడ్డులో శనివారం భక్తుల ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మైదుకూరుకు తిరిగి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులకు సహాయం అందించారు.