ఉరవకొండ: కళ్యాణదుర్గంలో నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం 11:40 నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని నాలుగో పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కళ్లం దుర్గం లో జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అనేక దౌర్జన్యం పాల్పడడం జరిగిందని అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా కూడా వైసిపి నేతలపై దాడులు చేయడం జరిగిందని వీటిని నిరసిస్తూ కలం దుర్గం లో నిర్వహించే ర్యాలీ కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం అన్యాయం అని ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారని,మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.