కనిగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మార్కాపురంలో శుక్రవారం జిల్లా స్థానిక సంస్థల పరిశీలకులు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అధ్యక్షతన జరిగిన మండల పార్టీల అధ్యక్షులు మరియు క్లస్టర్ ఇన్చార్జిల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందిస్థానాలు గెలుపొందే విధంగా నాయకులు కృషి చేయాలన్నారు.