ఉరవకొండ: ఉరవకొండ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వార్డు నెంబర్లు సర్పంచుల ఎంపికపై స్థానిక టిడిపి నేతలతో చర్చించారు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రంలో గురువారం నాలుగు గంటల 10 నిమిషాల సమయంలో ఉరవకొండ టిడిపి కార్యాలయంలో ఉరవకొండ మండలానికి సంబంధించిన టిడిపి నాయకులు సమావేశం నిర్వహించి వార్డు నెంబర్లు సర్పంచు అభ్యర్థుల గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక టిడిపి నేతలు మాట్లాడుతూ ఉరవకొండ మండల కేంద్రంలో ఒక్కొక్క వార్డు నెంబర్కు 5 మంది వరకు ఆశావాదులు ఉన్నారని సర్పంచ్ కు ఎనిమిది వంద వరకు అభ్యర్థులు ఆశావాదులు ఉన్నారని మీరు అన్ని పేర్లను పార్టీ పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుందని ఉరవకొండ తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.