ఉరవకొండ: బెలుగుప్పలో ఆకట్టుకున్న ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.
- శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించిన చిన్నారులు.
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని సన్ రైజర్స్ పాఠశాలలోగురువారం ఏర్పాటు చేసిన ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ మారెన్న ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎంఈఓ- 1 గోవిందరాజులు, ఎంఈఓ -2 హరికృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసంగా, ఉత్సాహంగాను, ఉట్టి కొట్టే కార్యక్రమాలు వేడుకలో అలరించాయి.