ఉరవకొండ: బెలుగుప్ప తాండ గ్రామంలో దుర్గమ్మ ఆలయం నిర్వహణ విషయంలో రెండు వర్గాలుగా చీలిపోయిన బెలుగుప్ప తాండ గ్రామ పెద్దలు గ్రామస్తులు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప తండాలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో బెలుగుప్ప తాండ పెద్దమ్మ అమ్మవారి ఆలయం నిర్వహణ విషయంలో గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలోనే బెలుగుప్ప తాండ శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయ విషయంలో ఇరు వర్గాలుగా గ్రామ పెద్దలు గ్రామస్తులుగా విడిపోయి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది విషయాన్ని గ్రహించిన స్థానిక పోలీసులు ఇరువర్గాలను ఆలయ ప్రాంగణం నుంచి పంపించి వేసి బెలుగుప్ప తాండ గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది, కేవలం ఆలయం కోసమే బెలుగుప్ప తాండ బస్సులు రెండు వర్గాలుగా విడిపోయారు.