నారాయణపేట్: ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి: జిల్లా కలెక్టర్ ఆదేశం
నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 12 ఫిర్యాదులు అందాయి. వీటిని పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.