ఉరవకొండ: ఉరవకొండలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అయుబ్ హుస్సేన్ పాఠశాలను సందర్శించి విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నార
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఎస్ ఎల్ ఎన్ కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మూడు గంటల 15 నిమిషాల సమయం లో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అయుబ్ హుస్సేన్ స్థానిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ మాట్లాడుతూ ఉరవకొండ మండలంలో ఎస్ ఎల్ ఎన్ కాలనీలో జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థినిలతో మాట్లాడి అక్కడ అందిస్తున్న విద్యను ఇతర సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు కొంతమంది విద్యార్థులు చదువులో వెనక ఉన్నారని వారిపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఉపాధ్యాయులను కోరడం జరిగిందని విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ పేర్కొన్నారు.