కనిగిరి: పట్టణంలో వెలిగొండ ప్రాజెక్టు జలాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
వెలిగొండ ప్రాజెక్టు నీటిని కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు అందించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కనిగిరిలో గురువారం అధికారులతో వెలిగొండ జలాలపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.