రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూలో జాతీయ పోషక ఆహార వారోత్సవాల్లో పాల్గొన్న జెఎన్టియు ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ సాంకేతిక ఔషధ పరిశోధన సంస్థ వారి ఫుడ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ పోషక ఆహార వారోత్సవాల్లో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఉపకులపతి సుదర్శన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల్లో పోషక ఆహార ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం వాటిలో పోషక ఆహారం సంబంధించిన ఉత్పత్తిలో నాణ్యత కల్తీ ఆహార పదార్థాలను నివారించేందుకు వాటిని గుర్తించేందుక ఫుడ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నార