నారాయణపేట్: నారాయణపేటలో రేపు కలెక్టరేట్ ముట్టడి: కరువు జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్
నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనుంది. వర్షాభావం, సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఆర్థిక సాయం, పంట నష్టపరిహారం అందించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.